బీపీ ఉన్నవారు గుండె పోటు రాకుండా ఉండాలంటే ఈ చిన్న పని చేస్తే చాలు.
ఇప్పుడు.. నువ్వు, నేను అనే తేడా లేకుండా.. యువకులు, మధ్య వయస్కులు కూడా ఈ రకం సమస్యతో బాధపడుతున్నారు. ఈ హై బీపీని సైలెంట్ కిల్లర్ అని చొప్పొచ్చు. ఎలాంటి లక్షణాలు చూపించకుండానే.. సడెన్ గా మనిషిని చంపేయగలదు. అందుకే దీనిని సైలెంట్ కిల్లర్ అని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా గుండెపోటు కేసులు వేగంగా పెరుగుతున్నాయి.
దీని వల్ల బరువు పెరిగిన వారు తీసుకునే ఆహారాలపై ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తున్నారు. అయితే ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా మంచిది. లేకపోతే గుండె పోటు వంటి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అయితే బరువు పెరిన వారు గుండె పోటు వస్తుందని యాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదుని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి జీవనశైలిలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మార్పులు చేసుకోవడం వల్ల గుండె సమస్యలు తగ్గడమేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. ఆరోగ్యకరమైన గుండె కోసం ఆరోగ్యకరమైన అలవాట్లు.. ప్రతి రోజూ 10 వేల అడుగులు నడవడవాలి. అరగంట వ్యాయామం కూడా చేయాల్సి ఉంటుంది. ఆఫీసు సమయంలో కూడా 25 నిమిషాలు కూర్చున్న తర్వా.. 5 నిమిషాలు లేచి నడవడం.
మానసిక ఆరోగ్యానికి యోగా అత్యంత ముఖ్యమైనది. కాబట్టి తప్పకుండా 15 నుంచి 20 నిమిషాల పాటు యోగాను చేయాలి. రాత్రిపూట 6 నుంచి 8 గంటలు నిద్రపోవడం చాలా ముఖ్యం. వీలైనంత మద్యం తీసుకోకపోవడం చాలా మంచిది. రక్తపోటును 120/80 పరిమితిలో ఉంచుకోండి. రక్తంలో చక్కెర పరిమాణాలను కూడా నియంత్రించుకోండి. అతిగా వినియోగించిన నూనెలను తీసుకోకపోవడం చాలా మంచిది.