కాళ్ల కింద దిండు పెట్టుకుని పడుకోవడం వల్ల ఏం అవుతుందో తెలుసా..?
పాదాల క్రింద దిండు పెట్టుకుని నిద్రపోవడం గర్భిణీ స్త్రీలకు మాత్రమే కాదు.. ప్రతి ఒక్కరికీ ప్రయోజనకరమే అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గర్భధారణ సమయంలో మహిళలు సాధారణంగా వారి పాదాల క్రింద దిండు పెట్టుకుని నిద్రపోతారు. ఇలా చేయడం ద్వారా వారు చాలా ప్రయోజనాలను పొందుతారు. అయితే గర్భిణులుగా ఉన్న మహిళలే కాళ్ల కింద దిండును వేసుకుని పడుకుంటారు. అలాగే కాళ్ల నొప్పులు ఉన్నప్పుడు కూడా చాలా మంది కాళ్ల కింద దిండును వేసుకుని పడుకుంటారు.
కాళ్ల కింద దిండును వేసుకుని పడుకోవడం వల్ల రిలాక్స్ గా అనిపించడమే కాదు ఎన్నో రకాల ప్రయోజనాలను కూడా పొందుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాళ్ల కింద దిండును వేసుకుని పడుకోవడం వల్ల గర్భిణులకు కలిగే ప్రయోజనాలు.. కాళ్ల కింద దిండును వేసుకుని పడుకోవడం వల్ల వారి శరీరంపై భారం చాలా వరకు తగ్గుతుంది. అంటే శరీరమంతా బరువు సమానంగా పడుతుంది. ఇలా పడుకోవడం వల్ల పాదాల వాపు కూడా తగ్గుతుంది. నడుముపై భారం తగ్గుతుంది. దీంతో వెన్ను నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఈ ప్రయోజనలు ఒక్క గర్భిణీ స్త్రీలకే కాదు.. ఇతరులకు కూడా ఉంటాయి. రక్తప్రసరణన సరిగ్గా జరుగుతుంది.. పాదాలకు రక్తప్రసరణ బాగా జరగాలి. ఇలా జరగకపోతే పాదాలు నొప్పులు పుడతాయి. మంట కూడా పెడుతుంది. అయితే పాదాల కింద దిండును పెడితే రక్తప్రసరణ సరిగ్గా జరుగుతుంది. దీంతో పాదాల నొప్పి, మంట తగ్గిపోతుంది. అందుకే ఇలాంటి సమస్యలున్న వారు రోజూ కాళ్ల కింద దిండును పెట్టుకునిన పడుకోండి. దీనివల్ల ఎలాంటి సమస్యలు రావు.
అయితే పాదాల కింద దిండును పెట్టుకుని పడుకోవడం మంచిదే కానీ.. తలకింద దిండును ఉపయోగించడం మాత్రం అంత మంచిది కాదు. దీనివల్ల మెడపై ఒత్తిడి పడి మెడనొప్పి వస్తుంది. సరైన పిల్లో వాడకుంటే బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది. అలాగే దిండుపై ఒక సైడుకు తిరిగి పడుకోవడం వల్ల ఫేస్ స్కిన్ దెబ్బతింటుంది. ఇది మొటిమలకు దారితీస్తుంది. అంతేకాదు దిండు కంఫర్ట్ గా లేకపోతే రాత్రళ్లు సరిగ్గా నిద్రపట్టదు.