ఖర్జూరాలు ఆ సమయంలో తింటే ఎంత మంచిదో తెలుసా..?
ఖర్జూరాల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల వీటిని రోజూ తింటే జీర్ణ సమస్యల నుంచి బయట పడవచ్చు. ముఖ్యంగా మలబద్దకం తగ్గుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. అయితే ఖర్జూరాలను ఖాళీ కడుపుతో ఖర్జూరాలు తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు. అయితే ఖర్జూరాలను తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గుంతుంది. ఖర్జూరాల్లో కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, కాపర్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.
ఇవి శరీరాన్ని, ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ ఖర్జూరాలు రక్తపోటును కూడా నియంత్రణలో ఉంచుతాయి. వివాహిక జీవితంలో సెక్స్ లైఫ్ చాలా అవసరం. అయితే కొందరికి సెక్స్ సామర్థ్యం తక్కువగా ఉంటుంది. అలాంటి వారు వీటిని తింటే మంచిది. ఎందుకంటే ఇవి ఇద్దరిలో లైంగిక శక్తిని పెంచుతాయి. పని లేదా మరేదైనా కారణం వల్ల అలసిపోయినట్టుగా అనిపిస్తే లేదా బలహీంగా ఉంటే వెంటనే ఖర్జూరాలను తినండి. అలసట తగ్గుతుంది. శరీరానికి శక్తి అందుతుంది. ఖర్జూరాల్లో ఉండే ఐరన్ కంటెంట్ శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది.
రోజుకు 4 ఖర్జూరాలు తినడం వల్ల ఆరోగ్యకరమైన బరువు పెరుగుతారు. ఖర్జూరాల్లో ఉండే ఫైబర్ కంటెంట్ పైల్స్ ను కూడా తగ్గిస్తుంది. ఖర్జూరాలను ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు. వీటిని ఉదయం ఖాళీ కడుపుతో లేదా మధ్యాహ్నం భోజనంలో తినడం ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బరువు పెరగాలనుకుంటే నిద్రపోయే సమయంలో నెయ్యితో పాటు ఖర్జూరాలను తినండి.
రోజుకు 4 సార్లు ఇలా తింటే మీరు ఆరోగ్యంగా బరువు పెరగడమే కాదు మీ జీర్ణక్రియ కూడా బాగుంటుంది. ఖర్జూరాలను నీటిలో నానబెట్టి తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతారు. ఎందుకంటే వాటిలో ఉండే టానిన్ లు ఫైటిక్ యాసిడ్ లను తొలగిస్తాయి.పోషకాలను తేలికగా శోషించుకోవడంలో సహాయపడుతాయి. నీటిలో నానబెట్టడం వల్ల అవి తేలికగా జీర్ణం అవుతాయి. ఖర్జూరాలను తినడానికి ముందు 8 నుంచి 10 గంటలు లేదా రాత్రంతా నానబెట్టడం మంచిది.