రక్తపోటు ఉన్నవారు ఒకసారి ఈ నల్ల ఉప్పు వాడి చుడండి, ఎందుకంటే..?
నల్ల ఉప్పు..ఆయుర్వేద వైద్యంలో వందల సంవత్సరాలుగా ఉపయోగించబడుతోంది. వేసవిలో ఆరోగ్యానికి సంబంధించిన అనేక సమస్యలు దీంతో పరిష్కరించవచ్చు. ఇందులో సోడియం క్లోరైడ్, సోడియం సల్ఫేట్, సోడియం బైసల్ఫేట్, సోడియం బైసల్ఫైట్, ఐరన్ సల్ఫైడ్, సోడియం సల్ఫైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే నల్ల ఉప్పులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే సోడియం స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. కడుపు సమస్యలను తగ్గిస్తుంది.. కాలేయానికి పైత్యరస ఉత్పత్తికి నల్ల ఉప్పు సహాయపడుతుంది.
అలాగే కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట వంటి సమస్యలన నుంచి కూడా బయటపడేస్తుంది. ఎందుకంటే ఇది శరీరంలో ఆమ్ల స్థాయిలను నియంత్రిస్తుంది.కండరాల తిమ్మిరిని నివారిస్తుంది.. నల్ల ఉప్పులో పొటాషియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మీ కండరాల ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఇది కండరాల తిమ్మిరిని తగ్గిస్తుంది. రక్తంలో గ్లూకోజ్ ను తగ్గిస్తుంది: అధిక రక్తపోటు లేదా మధుమేహులకు నల్ల ఉప్పు ఔషదంలాగే ఉపయోగపడుతుంది. ఇందుకంటే దీన్ని తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ అవుతాయి.
వివిధ ఆరోగ్య ప్రయోజనాల కోసం తెల్ల ఉప్పుకు బదులుగా నల్ల ఉప్పునే వాడాలని ఆరోగ్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఎందుకంటే తెల్ల ఉప్పు వివిధ దశల్లో ప్రాసెసింగ్ చేయబడుతుంది. కానీ నల్ల ఉప్పు అలా కాదు. అయితే తెల్ల ఉప్పు గడ్డలు కట్టకుండా ఉండటానికి సాధారణ లవణాన్ని కలుపుతారు. అయితే నల్ల ఉప్పును ప్రాసెస్ చేయకపోవడం వల్ల ఇది కొన్ని రోజులకు గడ్డలుగా ఏర్పుడుతుంది. తెల్ల ఉప్పులో చేర్చే లవణాలు ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. తెల్ల ఉప్పులో సోడియం కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది.
ఇది రక్తపోటును పెంచుతుంది. అలాగే ఇతర అనారోగ్య సమస్యలకు కూడా దారితీస్తుంది. అదే నల్ల ఉప్పులో అయితే సోడియం తక్కువ పరిమాణంలో ఉంటుంది. సాధారణ లవణంలో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అయితే ఈ లవణాలలోని ఖనిజాలు మన శరీరం అంత సులువుగా శోషించుకోలేదు. నల్ల ఉప్పులో ఖనిజాలు చాలా తక్కువగా ఉంటాయి. నల్ల ఉప్పు జీర్ణక్రియకు సహాయపడుతుంది. తెల్ల ఉప్పు ఈ సమస్యలను పెంచుతుంది. అందుకే తెల్ల ఉప్పుకు బదులుగా నల్ల ఉప్పునే వాడటం మంచిది.