తల స్నానం చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు. ఎందుకంటే..?
రోజుకు రెండుసార్లకు మించి స్నానం చేయడం వల్ల ముప్పు పొంచి ఉందని కొందరు పరిశోధకులు చెబుతున్నారు. రోజుకు రెండుకన్నా ఎక్కువసార్లు స్నానం చేయడం వల్ల శరీరంలోని అతి సూక్ష్మజీవ వ్యవస్థ దెబ్బతిని రోగనిరోధక, జీర్ణ వ్యవస్థలకు నష్టం కలుగుతుందని వారు అంటున్నారు. అయితే తలస్నానం చేసేటప్పుడు అందరూ చాలా వరకి కొన్ని తప్పులు చేస్తారు. నేరుగా హెయిర్ కి షాంపూ అప్లై చేయడం, ఎలా పడితే అలా జుట్టు రుద్దడం చేస్తారు. ఇలా చేస్తే అది జుట్టు నాణ్యత మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందనే విషయం మీద ఎక్కువగా అవగాహన ఉండదు.
అందుకే ఎక్కువగా జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడతారు. జుట్టు తడిగా ఉన్నప్పుడు విరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు జుట్టు సమస్యల్ని తీవ్రతరం చేస్తాయి. అందుకే హెయిర్ కేర్ విషయంలో జాగ్రత్తలు అవసరం ఉంది. జుట్టుని సరైన మార్గంలో వాష్ చేసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు. జుట్టు రాలే సమస్యకి చెక్ పెట్టేయవచ్చు. తరచూ షాంపూ చెయ్యొద్దు.. షాంపూ ఖచ్చితంగా జుట్టుని శుభపరుస్తుంది. వారానికి ఒకటి లేదా రెండు సార్లు జుట్టును కదిగేందుకు షాంపూ చేసుకోవచ్చు, కానీ అంతకంటే ఎక్కువ సార్లు మాత్రం చేస్తే అది జుట్టుని బలహీనపరుస్తుంది. షాంపూ ఎక్కువగా చేయడం వల్ల జుట్టులో ఉండే సహజ నూనె, తేమ తగ్గిపోతుంది.
దాని వల్ల జుట్టు నిర్జీవంగా కనిపిస్తుంది. వేడి నీటితో కడగాలి.. తలస్నానం గోరువెచ్చని నీటితో చెయ్యాలి. స్కాల్ఫ్ వేడి ఉష్ణోగ్రత వల్ల మాడు, జుట్టు రెండు పొడిగా మారిపోతాయి. ఇది జుట్టు మూలాలని దెబ్బతీస్తుంది. అందుకే గోరువెచ్చని నీటితో తలస్నానం చేయడం వల్ల కండిషన్లు వంటి ఉతపత్తులు స్కాల్ఫ్ లోకి చొచ్చుకుపోయేలా చేసేందుకు సహాయపడుతుంది. మెరుగైన శోషణకి దారి తీస్తుంది. హెయిర్ వాష్ ముందుగా గోరు వెచ్చని నీటితో చేసి చివరగా చల్లని నీటితో ముగించాలి. చల్లని నీళ్ళు జుట్టులో తేమని లాక్ చేస్తాయి. టవల్ తో జుట్టు రుద్దకూడదు.. జుట్టు తడిగా ఉన్నప్పుడు చాలా పెళుసుగా ఉంటుంది. తలస్నానం చేసిన వెంటనే టవల్ తో బాగా రుద్దడం వల్ల జుట్టు రాలిపోయే అవకాశం ఉంది.
టవల్ ఉపయోగించి పొడిగా ఉండేలా రుద్దడం వల్ల జుట్టు చిక్కు పడిపోయి చిట్లి పోతుంది. అందుకే కాసేపు గాలికి ఆరబెట్టుకుని ఆ తరవాత జుట్టుని మెల్లగా తుడుచుకోవడం మంచిది. ఇలా సున్నితంగా ఆరబెట్టుకోవడం జుట్టుకి ఆరోగ్యకరం. తల తుడిచేందుకు కఠినమైన టవల్ ని ఉపయోగించకూడదు. ఉత్పత్తులు తరచూ మార్చవద్దు.. జుట్టు సంరక్షణ కోసం రకరకాల ఉత్పత్తులు మారుస్తూ ఉంటారు. అవి జుట్టుకి అసలు మంచిది కాదు. ఎందుకంటే కొత్త ఉత్పత్తులకి జుట్టు అలవాటు పడకపోతే రాలిపోవడం జరుగుతుంది. అందుకే ఎప్పుడు ఒకే హెయిర్ వాష్ ఉపయోగించాలి. ఒకే రకమైన షాంపూ లేదా కండిషనర్ కి కట్టుబడి ఉండాలి.