రాగి పాత్రల్లో నీటిని తాగుతున్నారా..? ఈ విషయాలు మీ కోసమే.
రాగి పాత్రలో ఉంచిన నీటిని తాగడం వల్ల కలుషిత నీరు తాగడం వల్ల వచ్చే అనేక వ్యాధులు దూరమవుతాయి. ఉదాహరణకు లూజ్ మోషన్, పొత్తికడుపు నొప్పి, విరేచనాలు మొదలైనవి. రాగి నీటిని తాగడం వల్ల శరీరంలో కాపర్ లోపం ఉండదు. అయితే అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లు కాపర్ నీటిని తీసుకోవడంలోనూ కొన్ని పరిమితులున్నాయి. అయితే సహజసిద్ధమైన వనరులతో తయారైన రాగితో చేసే పాత్రల్లో నీరు తాగితే ఆరోగ్యం చాలా మెరుగు పడుతుంది. కాపర్ వాటర్ అని కూడా పిలిచే ఈ వాటర్ తాగడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
గాయాలు, వాపులు నయం, అజీర్తి సమస్యలు మాయం.. ఆర్థరైటిస్, కీళ్లనొప్పులు, కీళ్ల సమస్యలతో బాధపడుతున్నవారికి కూడా రాగి పాత్రలో నీరు చాలా మంచి చేస్తాయి. రాగి శరీరంలోని ఎముకలను దృఢంగా మారుస్తుంది. ఈ సమస్యలను కూడా పోగొట్టగల శక్తి రాగిపాత్రలోని నీటికి ఉంటుంది. కాలుష్య కారకాలు, హానికరమైన సూక్ష్మక్రిములు నశింప చేయడంలో రాగి గొప్ప పాత్ర పోషిస్తుంది. ఫలితంగా జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది. రాగి నీళ్లతో గాయాలను కడగడం ద్వారా అవి త్వరగా నయమవుతాయి. రాగినీటితో గుండె, మెదడు ఆరోగ్యం పదిలం.. రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి రక్తనాళాలలో రక్తసరఫరా సరిగా జరిగేలా రాగి నీళ్లు దోహదపడతాయి. దీనివల్ల గుండె సంబంధిత రోగాలు దరిచేరవు.
కాపర్ వాటర్‌తో బ్రెయిన్ స్ట్రోక్ బారి నుంచి కూడా తప్పించుకోవచ్చు. ఆక్సిడెంట్లను వేగంగా లేదా మెరుగ్గా పని చేయకుండా రాగి నీళ్లు ఆపి బ్రెయిన్ స్ట్రోక్‌కు చెక్ పెడతాయి. వృద్ధాప్య సమస్యలు, ఇన్ఫెక్షన్లు హుష్ కాకి.. ఫ్రీ రాడికల్స్ ఎఫెక్ట్ నుంచి కాపాడి వృద్ధాప్య సమస్యలను దరిచేరకుండా చేస్తుంది. రాగి నీటిలో సమృద్ధిగా లభించే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఇన్ఫెక్షన్లను పూర్తిగా నయం చేయడంలో బాగా సహకరిస్తాయి. బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.. బరువు తగ్గాలనుకునే ప్రజలు రాగి పాత్రలో స్టోర్ చేసిన వాటర్ తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది.
శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో రాగి నీళ్లు అద్భుతంగా పని చేస్తాయి. ఈ నీరు తాగడం ద్వారా శరీరంలో శక్తి, వాటర్ లోని మంచి పదార్థాలు పుష్కలంగా అందుతాయి. పెరిగే హిమోగ్లోబిన్ కౌంట్.. శరీరంలోని రక్త సంబంధిత సమస్యలు లేదా హెమటోలాజికల్ డిజార్డర్లను పోగొట్టగలిగే సామర్థ్యం దీని సొంతం. థైరాయిడ్ గ్రంధి సమస్యలకు చెక్.. రోజూ తీసుకుంటున్న ఆహారంలో తగినంత రాగి లేకపోతే థైరాయిడ్ గ్రంథులు సరిగా పనిచేయవు. దీని వల్ల థైరాయిడ్ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అందుకే కాపర్ వాటర్ తాగుతూ ఉండటం మంచిది.