బీరు తాగే వారికీ అద్దిరిపోయే శుభవార్త. అదేంటో తెలుసుకుంటే..?
ఎమోషన్ ఏదైనా మద్యం ఉండాల్సిందే. ఇవేవీ లేవు.. కాని తాగడానికి మాకు ప్రత్యేకమైన కారణం అవసరం లేదు అనే బ్యాచ్ కూడా ఒకటుందండోయ్… అయితే మద్యం తాగడంలో చాలా మంది ఎంపిక బీర్. ఇతర ఆల్కహాల్ ఉత్పత్తుల వలె ఇది ప్రమాదకరమైనది కాదు. అయితే సాధారణంగా వచ్చే కంటి చూపులోపాలు కూడా బీరు తాగడం వల్ల రావట. చాలామందికి వృద్ధాప్యం వల్ల కంటి చూపు తగ్గుతుంది. కానీ.. బీరు తాగడం వల్ల కంటి చూపు సమస్యలు తగ్గుతాయట.
కెనడాలో నిర్వహించిన ఓ స్టడీలో ఈ విషయం వెల్లడైంది. ప్రతిరోజు ఓ గ్లాస్ బీరు తాగితే.. కంటి చూపు మెరుగవుతుందట. బీరులో ఉండే యాంటీ యాక్సిడెంట్లు క్యాన్సర్ కణాలతో పోరాడుతాయి. వాటిని నాశనం చేస్తాయి. ఒరెగాన్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు నిర్వహించిన స్టడీలో ఈ విషయం వెల్లడైంది. బీరు తాగితే ఒత్తిడి కూడా మాయమై పోతుంది. బీపీ ఉన్నవాళ్లు బీరు తాగితే… వాళ్ల బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ లో ఉంటుందట.
ఈ విషయాన్ని హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు హైబీపీతో బాధపడుతున్న వ్యక్తులకు బీరు తాగించి అధ్యయనం నిర్వహించారు. హైబీపీతో బాధపడుతున్న వాళ్లకు బీరు తాగాక వాళ్ల బీపీ కంట్రోల్ లో ఉందట. బీరులో 20 శాతం ఫైబర్ కంటెంట్ ఉంటుంది. దీని వల్ల శరీరానికి కావాల్సిన ఫైబర్ బీరు ద్వారా అందుతుంది. మనం తినే ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండాలి. ఫైబర్ ఎక్కువగా ఉంటే మనం తిన్న ఆహారం కూడా త్వరగా జీర్ణం అవుతంది.
బీరులో కిడ్నీలలోని రాళ్లను కరిగించే గుణాలు కూడా ఉన్నాయట. బీర్లలో ఉండే పొటాషియం, మెగ్నీషియం కిడ్నీల్లో రాళ్లు కరిగించడానికి సహాయపడుతాయట. అయితే.. బీర్లు తాగడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి కదా అని చెప్పి రోజూ పీపాలకు పీపాలు లాగిస్తే మాత్రం అది మీ ఆరోగ్యానికే ముప్పు వాటిల్లేలా చేస్తుంది. అందుకే.. ఏదైనా మితంగా తీసుకుంటే మంచిది. అమితంగా తీసుకుంటే మీకు మీరే ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నవారవుతారు.