Health

ఈ అలవాట్లు ఉంటె వెంటనే మానుకోండి, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది.

బ్రెయిన్ స్ట్రోక్ లేదా పక్షవాతం. ఇది రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ప్రధానంగా మారుతున్న జీవనశైలి, జంక్‌ఫుడ్స్, ఒత్తిడి, ధూమపానం, మద్యపానం, స్థూలకాయం, మధుమేహం, హైబీపీ వంటి కారణాలతో ఎక్కువ మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత కూడా సకాలంలో సరైన చికిత్స అందిస్తే మరణించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే ధమనుల లోపలి ఉపరితలం మృదువుగా ఉంటుంది. రక్తప్రసరణలో ఇబ్బంది తలెత్తినప్పుడు ధమనిలో గడ్డ ఏర్పడుతుంది. ఇది స్ట్రోక్ కి దారి తీస్తుంది.

స్ట్రోక్ రెండు రకాలు. ఒకటి మోడిఫైబుల్, నాన్ మోడిఫైబుల్ స్ట్రోక్. వయస్సు సంబంధిత మార్పుల కారణంగా నాన్ మోడిఫైబుల్ స్ట్రోక్ వస్తుంది. దీన్ని నివారించలేము. ఇందులో జన్యుపరమైన అంశాలు కూడా పాత్ర పోషిస్తాయి. మోడిఫైబుల్ స్ట్రోక్ మధుమేహం, రక్తపోటు, మద్యపానం, ఊబకాయం, కొలెస్ట్రాల్, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల వస్తుంది. ఈ అనారోగ్య అలవాట్లు కారణంగా ధమనిలో రక్తప్రసరణకి అడ్డుగోడ ఏర్పడుతుంది. అప్పుడు ఇస్కీమిక్ స్ట్రోక్ వస్తుంది. ఇది ఒక్కోసారి గడ్డకట్టే ప్రమాదం వరకి వచ్చే అవకాశం ఉంది.

ఆల్కహాల్ తీసుకోవడం.. ఒక వ్యక్తి ఎక్కువ కాలం ఆల్కహాల్ తీసుకుంటే ధమనిలో మార్పులు వస్తాయి. వాళ్ళు స్ట్రోక్ తో పాటు గుండెపితుకి గురయ్యే అవకాశం కూడా ఉంది. ఈ అలవాటు మార్చుకోవడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ కి గురయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. ధూమపానం కూడా మెదడు, గుండెకు ప్రమాదకరం. నిద్ర.. శరీరం అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర, వేళకి తినడం అవసరం. నిర్ణీత సమయానికి నిద్రపోవడం, నిద్రలేవడం చాలా అవసరం. నిద్రకి అంతరాయం ఏర్పడినప్పుడు దాని ప్రభావం శరీరం మొత్తం మీద పడుతుంది.

ఆహారపు అలవాట్లు.. జంక్ ఫుడ్ తొలగించి వాటికి బదులుగా పండ్లు, కూరగాయలతో సయ అధిక ఫైబర్ ఉన్న ఆహారాన్ని ఎంచుకోవాలి. భోజనం సరైన సమయానికి చేయకపోతే అది మెదడుని కలవరపెడుతుంది. తగినంత ద్రవాలు తీసుకోవాలి. ఒత్తిడి.. ఒత్తిడి సాధారణ సమస్యగా మారిపోతుంది. ఇది ఎక్కువ మందిని ప్రభావితం చేస్తుంది. యువతలో బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి అధిక కారణాం ఇదే. రెగ్యులర్ వ్యాయామం.. రోజులో కనీసం 30-45 నిమిషాల వ్యాయామంలో కఠినమైన వ్యాయామాలు చెయ్యకూడదు. తేలికపాటి వ్యాయామాలతో రోజు ప్రారంభించాలి. ఊబకాయం కూడా స్ట్రోక్ ప్రమాదానికి మరొక కారణం.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker