కన్ను అదురుతుందా..? అది దేనికీ సంకేతమో తెలుసా..?
ఆడవారికి ఎడమ కన్ను, మగవారికి కుడి కన్ను అదిరితే మంచిదని మంది భావిస్తారు.. ఎడమ కన్ను అదిరితే ఓ అపరిచితుడు జీవితంలోకి వస్తాడు.. అదే కుడికన్ను అదిరితే తమ ఇంట్లో లేదా బంధువుల ఇళ్లలో బిడ్డ పుడుతుంది అని నమ్ముతారు. అయితే మనకు సాధారణంగా కొన్ని సార్లు.. కుడి కన్ను పదే పదే కొట్టుకుంటుంది. ఇది రాబోయే మంచికి శుభ సూచకం అన్నమాట. అయితే, మగ వారికి కుడి కన్ను కొట్టుకుంటే ఎంతో మంచిది. మనం ఏదైన పని మనసులో అనుకొన్న తర్వాత.. కుడి కన్ను కొట్టుకుంటే అది తప్పక జరుగుతుందని సూచిస్తుంది.
అసలు జరగని పనులు కూడా జరుగుతాయి. అదే కొందరిలో ఎడమ కన్ను పదే పదే కొట్టుకుంటుంది. ఆడవాళ్లకు ఎడమ కన్ను కొట్టుకుంటే అనేక లాభాలు కల్గుతాయి. వారు అనుకుని ప్రారంభించిన పనులు నెరవేరుతాయి. కానీ అదే అబ్బాయిల విషయానికి వస్తే.. ఎడమ కన్నుకొట్టుకుంటే రాబోయే ప్రమాదాన్ని ముందే సూచిస్తుందని అర్థం. మగ వారిలో ఏదైన పని అనుకున్న తర్వాత.. ఎడమ కన్నుకుంటే..
అది మధ్యలో ఆగిపోతుందనో లేదా దాని వల్ల ఏదైన నష్టం వస్తుందో అనే విషయాన్ని సూచిస్తుంది. ఒక వేళ ఎడమ కన్ను కొట్టుకుంటే.. మగవాళ్లు మట్టుకు చాలా వరకు పనులు కాసేపు మానుకొవడం ఉత్తమం. అదే విధంగా మనం చేసే పని సరైన దేనా అని మరోసారి ఆలోచించాలి. పదే పదే కొట్టుకుంటే.. కన్ను మీద నుంచి బంగారంతో అద్దుకొవాలి. పంచేంద్రియనం నయనం ప్రధానం. కాబట్టి మన శరీరంలోని కొన్ని అవయవాలు అనుకొకుండా అదురుతాయి.
అవి మనకు రాబోయే మంచి, చెడులను ముందుగానే పసిగడుతాయి. దీనిలో మనం అలర్ట్ అయితే ఇబ్బందుల నుంచి తప్పించుకొవచ్చు. దీని కోసం పెద్దలు కొన్ని రకాల సూచనలు చేశారు. మనకు బయటకు వెళ్దామనుకోగానే కన్నుకొట్టుకుంటే.. వెంటనే ఒక వేళ మగ వారికి ఎడమ కన్ను, ఆడవారికి కుడికన్ను కొట్టుకుంటే , ఏదైన బంగారంలో కళ్లకు రాసుకొవాలి. ఆ తర్వాత.. కాసింత చక్కెర చేతిలో వేసుకుని తినాలి. దేవుడికి దండం పెట్టుకుని తిరిగి పనికి వెళ్లిపోవాలి. దీనితో రాబోయే ఆపద ఏదైన ఉంటే అది తప్పిపోతుంది.