Health

ఏ కలర్ జామకాయ తింటే ఆరోగ్యానికి మంచిదో తెలుసా..?

ఈ రోజుల్లో ఎంత డబ్బు ఉన్నా అన్నీ కొల్చుకుని తినాల్సి వస్తోంది.ఎందుకంటే చాలా రోజులు ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా ఉండుట వలన ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. అప్పుడు ఆరోగ్యకరమైన ఆహారం కోసం వెతుకులాట ప్రారంభిస్తారు.అయితే ఏ పండు మంచిది అంటే ఆ పండును ఎక్కువగా తినేస్తూ ఉంటారు. అయితే మనం ఆరోగ్యంగా ఉండాలంటే సీజనల్ ఫ్రూట్స్ ను తప్పకుండా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే మనకు ఎన్నో రకాల పండ్లు అందుబాటులో ఉంటాయి. అందులో ప్రతి ఒక్క పండూ దాని సొంత ప్రరయోజనాలను కలిగి ఉంటుంది.

అలాంటి పండ్లలో జామపండు ఒకటి. అయితే ఈ జామ పండ్లు కొన్ని తెల్ల కలర్ లో.. మరికొన్ని పింక్ కలర్ లో ఉంటాయి. ఇక వీటిలో ఏది మన ఆరోగ్యానికి ఎక్కువ మంచి చేస్తుందో.. తెలుసుకోవడానికి చాలా మంది కన్ఫూజ్ కు గురవుతుంటారు. డైటీషియన్ శిఖా కుమారి దీని గురించి పూర్తిగా వివరించింది. తెలుపు, పింక్ జామకాయల మధ్య తేడాలను ఆమె ఇన్ స్టాగ్రామ్ లో తెలియజేసింది. తెల్ల జామకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. ఇది లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఈ జామకాయ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది.

గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అంతేకాదుు రుతుస్రావం నొప్పి నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఇది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఈ జామపండు యాంటీ క్యాన్సర్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఈ తెలుపు జామకాయ రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఇది చర్మ ఆరోగ్యానికి కూడా మంచిది. తెలుపు జామకాయలో ఇనుము, కాల్షియం, భాస్వరం పుష్కలంగా ఉంటాయి.

ఈ తెలుపు జామకాయలు డయాబెటీస్ పేషెంట్లకు చాలా మంచివి. పింక్ జామకాయల ఆరోగ్య ప్రయోజనాలు..పింక్ జామకాయలో కెరోటినాయిడ్లు అని పిలువబడే వర్ణద్రవ్యం ఉంటుంది. ఇది క్యారెట్లు, టమోటాలకు వాటి విలక్షణమైన ఎరుపు రంగును ఇస్తుంది. పింక్ జామకాయలను ‘సూపర్ ఫ్రూట్స్’ అని కూడా అంటారు. ఎందుకంటే వీటిలో విటమిన్ ఎ, విటమిన్ సి, ఒమేగా 3, ఒమేగా 6 పాలీ అన్శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ పండు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఏ రంగు జామకాయను తింటే మంచిది.. పింక్ జామకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది.

అలాగే తక్కువ చక్కెర, తక్కువ పిండి పదార్థం ఉంటుంది. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. గింజలు కూడా తక్కువగా ఉంటాయి. అదే తెల్లజామకాయలో అయితే షుగర్ కంటెంట్, పిండి పదార్ధం, విటమిన్ సి తో పాటుగా గింజలు కూడా ఎక్కువగానే ఉంటాయి. తెల్ల గుజ్జు జామకాయలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కానీ సాధారణ జలుబు, దగ్గుతో బాధపడుతుంటే మాత్రం పింక్ జామకాయలను తినడం మంచిది కాదు. చిన్న, మిడీయం సైజులో ఉండే జామకాయలనే కొనడం మంచిది. ఇలా ఉన్నప్పుడే మీరు జామకాయలను ఒకేసారి ఫినిష్ చేస్తారు. మచ్చలుండే జామకాయలను తింటే అవి త్వరగా చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వాటిని కొనకపోవడే మంచిది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker