ఈ పండు తరచూ తింటే శరీరంలో పెరుకపోయిన కొవ్వు కరిగిపోతుంది.
ఈ ఆప్రికాట్ పండు యొక్క మూలం చైనా అయినా కాల క్రమేణా అక్కడి నుంచి వివిధ దేశాలను వ్యాప్తి చెందింది. ఇది చాలా రుచికరంగా ఉంటుంది మరియు ఈ పండు ను ఫ్రెష్ గా ఉన్నప్పుడు, ఎండిన తరవాత డ్రై ఫ్రూట్ లాగా మరియు జామ్ లాగా కూడా తింటారు. ఈ పండు లో ఉండే పోషకవిలువలు పలు రకాల రోగాల నుంచి కాపాడటంలో కూడా సహాయపడుతుంది. అయితే ఆప్రికాట్.
ఈ పండు పేరు చెప్పగానే చాలా మంది తెలియదే.. అనే విధంగా ముఖంలో భావన వ్యక్తం చేస్తుంటారు. దీన్నే సీమ బాదం అని, ఖుర్భానీ పండు అని కూడా పిలుస్తారు. ఇది తీపి, వగరు రుచులతో భిన్నంగా ఉంటుంది. అయితే ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం లెక్కలేనంతగా ఇస్తుంది. కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, విటమిన్ ఏ, ఐరన్, విటమిన్ సీ పుష్కలంగా ఉంటాయి. ఆప్రికాట్ పండును తినడం వలన ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
శరీరంలో పెరిగి మనల్ని ఇబ్బంది పెట్టే కొవ్వును తగ్గించుకోవడంతో ఈ పండు చాలా గ్రేట్‌గా పనిచేస్తుంది.వీటిలో అధిక ఫైబర్‌తో పాటు లాక్సేటివ్ గుణాలు ఉండి మలబద్ధకం సమస్యలను దూరం చేస్తుంది. వీటిలోని విటమిన్ ఏ కంటి సమస్యలు రాకుండా చూస్తుంది. వీటిలో ఇనుము సమృద్ధిగా ఉండి అనీమియా రాకుండా కాపడుతుంది. మంచి కొలెస్ట్రాల్ తగ్గించి.. చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాపడుతుంది. ఎముకల ఆరోగ్యానికి కావాల్సిన ఖనిజాలు వీటిలో మెండుగా ఉంటాయి.
వీటిలో ఏ, సీ విటమిన్లతో పాటు ఫైటోన్యూట్రియంట్స్ చర్మాన్ని ఆరోగ్యంగా మృధువుగా ఉంచుతాయి. కండరాలకు శక్తిని అందజేస్తుంది. క్యాన్సర్లను నివారించే కెరోటినాయిడ్స్ ఇతర యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. తక్కువ క్యాలరీలను కలిగి ఉండి శరీరం బరువు పెరగకుండా కాపాడుతుంది. దీనిలో అధికంగా ఉండే పీచు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. కాలేయంలో కొవ్వు పేరుకుపోయి ఫ్యాటీ లివర్ వ్యాధి రాకుండా కాపాడుతుంది. ఉబ్బసం, జలుబు, ఫ్లూ లక్షణాలు ఉన్నవారికి ఉపశమనం కలిగిస్తుంది.