నిమ్మకాయ పచ్చడి పెరుగులో కలిపి తింటే ఎన్ని లాభాలో తెలుసా..?
మన అమ్మమ్మలు, నానమ్మలు సహజ సిద్ధంగా లభించే పదార్థాలతోనే ఈ పచ్చళ్లు తయారు చేసేవారు. ఉప్పు, మసాలాలు.. చివరికి సూర్యరశ్మిని సైతం ఈ పచ్చళ్ల తయారీకి వాడేవారు. సీజనల్ ఫలాలైన మామిడి వంటి పండ్లను అన్ని సీజన్లలో తినేందుకు వీలుగా పచ్చళ్లు తయారు చేసేవారు. ఆ పచ్చళ్లల్లో అన్నిరకాల పోషకాలు ఉండేలా చూసుకొనేవారు. ఎక్కువ రోజులు చెడిపోకుండా నిల్వ ఉంచేందుకు వీలుగా అప్పట్లో సహజసిద్ధ పదార్థాలను ఉపయోగించేవారు.
అయితే మన తెలుగు వంటకాల్లో తొక్కులది ప్రత్యేక స్థానం. ఏ కూరతో భోజనం చేసినా మొదటి ముద్ద తొక్కులతో ఉండాల్సిందే. అయితే నిల్వ ఉంచే తొక్కులు ఆరోగ్యానికి మంచిది కాదని చాలామంది వాదిస్తున్నారు. ఇప్పటి పిల్లలు తొక్కులతో తినేందుకు ఇష్టపడటం లేదు. కానీ తొక్కుల్లో ఆరోగ్యానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా పుల్ల పుల్లగా కారం కారం ఉండే నిమ్మకాయ తొక్కుతో ఆరోగ్యానికి ఎంతో మంచిది. రక్తపోటు నియంత్రణ.. ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా ఉండాలి. రక్త ప్రవాహంలో హెచ్చు తగ్గులు రక్తపోటుకు కారణమవుతుంది.
అయితే రోజూ నిమ్మకాయ తొక్కుతో తినడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. గుండె ఆరోగ్యానికి మంచిది.. నిమ్మకాయ తొక్కులో ఎన్నో పోషకాలు ఉంటాయి. పైగా కొవ్వు అసలు ఉండదు. హృద్రోగాలు వచ్చే ప్రమాదం తక్కువ ఉంటుంది. కాబట్టి దీన్ని నిరభ్యంతరంగా డైట్లో చేర్చుకోవచ్చు. ఎముకలు బలంగా ఉంటాయి.. నిమ్మకాయలో కాపర్, పొటాషియం, ఐరన్, కాల్షియం ఉంటాయి. వయసు పెరిగే కొద్ది ఎముకల ఆరోగ్యం క్షీణించడం మొదలవుతుంది.
కాబట్టి కాల్షియం, విటమిన్ ఏ, సీ, పొటాషియం కలిగిన నిమ్మకాయ తొక్కును ఆహారంగా తీసుకోవడం ద్వారా ఎముకల ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. రోగ నిరోధక శక్తి పెంపు.. సప్లిమెంట్ల ద్వారా విటమిన్లు, పోషకాలను తీసుకోవడానికి బదులు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. అలాంటి ఆహారాల్లో నిమ్మకాయ తొక్కు ఒకటి. ఇందులో బీ కాంప్లెక్స్ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. జీర్ణ క్రియ మెరుగు..నిమ్మకాయ తొక్కు తినడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. నిమ్మలో ఉండే ఎంజైములు శరీరంలోని విషతుల్యాలను తొలగించడంలో సహకరిస్తాయి. దీనివల్ల బరువు పెరగకుండా ఉంటారు.