ఖర్జూరాలు రోజూ 5, 6 తింటే ప్రాణాంతక వ్యాధుల సైతం మటుమాయమే.
పాలలో ఖర్జూరపండు వేసి బాగా మరిగించి ఆ పాలను తాగితే శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి. ప్రత్యేకించి పిల్లలకు, సాధారణంగా పెద్దలకు వేసవిలో శక్తినివ్వటానికి వాడవచ్చు. ఈ పండులో వుండే నికోటిన్ పేగు సంబంధిత సమస్యలకు మంచి వైద్యంగా వాడవచ్చు. దీనిని తరచుగా వాడుతూంటే, పేగులలో స్నేహపూరిత బాక్టీరియాను బాగా అభివృధ్ధి చేయవచ్చు. అయితే మనదేశంలో ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ రూపంలో ఖర్జూరాలను తింటారు.
వీటిని షేక్స్, స్వీట్లు, అనేక రకాల వంటకాల తయారీలో ఉపయోగిస్తారు. ఖర్జూరం అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. దీనితో పాటు గర్భిణీ స్త్రీలపై ఇది ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుందని ఒక అధ్యయనంలో సైతం తేలింది. ప్రెగ్నెన్సీ సమయంలో ఖర్జూరం తినడం వల్ల లేబర్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని పరిశోధకులు తెలిపారు. అందుకే ప్రతిరోజూ ఉదయం లేదా.. రాత్రి సమయాల్లో ఖర్జురా పండ్లను తీసుకోవాలని సూచిస్తున్నారు. రాత్రి నానబెట్టి ఉదయం ఎండు ఖర్జూరాలను తిన్నా అనేక పోషకాలు లభిస్తాయని పేర్కొంటున్నారు.
ఖర్జూరంలో అనేక రకాల పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఖర్జూరాలు యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఖనిజాలు, విటమిన్ల నిధి. దీన్ని ఉదయాన్నే తీసుకోవడం వల్ల రోజంతా శక్తి లభిస్తుంది. రేగు, అత్తి పండ్ల కంటే ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్నాయని ఒక అధ్యయనంలో తేలింది. ఖర్జూరం మధుమేహం, అల్జీమర్స్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇందులో ఉండే కెరోటినాయిడ్స్ కళ్లు, గుండెకు మేలు చేస్తాయి.
విటమిన్లు B1, B2, B3, B5, A1తో పాటు అనేక రకాల అమైనో ఆమ్లాలు కూడా ఖర్జూరంలో ఉంటాయి. గర్భిణీలు ప్రసవానికి ఒక నెల ముందు ఖర్జూరం తినడం ప్రారంభిస్తే ఆమె సాధారణ ప్రసవానికి అవకాశాలు పెరుగుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. గర్భధారణ సమయంలో ఖర్జూరం తినడం తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. ప్రతిరోజూ ఖర్జురాలు తినడం వల్ల చర్మం, మెదడు, ఎముకలు, జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇంకా శరీరంలోని కొవ్వును తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తపోటు సమస్యను దూరం చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.