మహిళలకు శుభవార్త, మగవారి కోసం ఆ మాత్రలు వచ్చేస్తున్నాయి.
మగవారి కోసం గర్భనిరోధక మాత్రలను అందుబాటులో తీసుకురావడం కోసం గత కొన్నేళ్లు పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ ప్రయోగాల్లో స్కాట్‌లాండ్ కు చెందిన యూనివర్సిటీ అఫ్ డుండీ అడుగు ముందుకేసింది. అయితే కండోమ్ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చిన తర్వాత అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీ రాకుండా మగవారి కోసం ఎలాంటి గర్భనిరోధకాలు రాలేదు. చాలా మంది వీటిని పెట్టుకోవడానికి ఇష్టపడరు. ఈ కారణంగా మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఏటా కొన్ని లక్షల మంది అనుకోకుండానే గర్భం దాలుస్తున్నారు. తర్వాత అబార్షన్‌లకు వెళ్లి ఆరోగ్యాలు పాడుచేసుకుంటున్నారు.
ఏడాదిలో రెండుమూడు సార్లు అబార్షన్‌లు కూడా అవుతున్నాయి. ఈ అసమానత పోగొట్టేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. పురుషుడి కోసం స్కాట్‌లాండ్‌లోని దుండీ విశ్వవిద్యాల శాస్త్రవేత్తలు పిల్స్ రెడీ చేసే పనిలో పడ్డారు. దుండీ యూనివర్శిటీ ప్రయోగాలకు బిల్‌గేట్స్ సంస్థ హెల్ప్ చేస్తోంది. వచ్చే రెండేళ్లలో కావాల్సిన నిధులు ఇచ్చేందుకు సిద్ధమైంది. సుమారు పదిహేడు లక్షల డాలర్లు అందించేందుకు సముఖత వ్యక్తం చేసింది. మగవారి కోసం ఇలాంటి కుటుంబ నియంత్రణ పిల్స్ తయారీలో చాలా సమస్యలు ఉన్నాయంటున్నారు శాస్త్రవేత్తలు.
అందుకే ఇన్నాళ్లు దీనిపై పెద్దగా పురోగతి సాధించలేదన్నది వారి వాదన. పురుషుడి వీర్య కణ బయాలజీపై అవగాహన లేకపోవడం ఓ కారణమైతే… ఒకసారి బయటకు వచ్చిన తర్వాత వీర్యకణం ఏం చేస్తుందన్నదానిపై కూడా నమ్మకమైన పరిశోధనలు జరగలేదు. అందుబాటులో ఉన్న మందులో ప్రభావాన్ని స్క్రీన్ చేసే వ్యవస్థ లేకపోవడం కూడా ఈ పరిశోధనలు ముందుకు సాగలేదు. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు దుండీ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు సమాంతర టెస్టింగ్ సిస్టాన్ని డెవలప్ చేశారు. అందులో ఉండే వేగవంతమైన మైక్రోస్కోప్, ఇమేజ్‌ప్రోసెసింగ్ టూల్స్… వీర్యకణాల కదలికలను పసిగడతాయి.
అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీ వల్ల ఎక్కువ మహిళలే ఇబ్బంది పడుతున్నారని… ఆరోగ్యాలు పాడుచేసుకుంటున్నారు.. ఈ అసమానత్వాన్ని పోగట్టేందుకు మగవారి కోసం పిల్స్‌పై పరిశోధన చేస్తున్నట్టు చెబుతున్నారు డుండీ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. రెండేళ్లలో ఈ పిల్స్‌పై కచ్చితమైన ఫలితాలు సాధిస్తామంటున్నారు. మగవారు వాడుకునే మాత్రలు రెడీ అయితే కచ్చితంగా కొత్త శకం మొదలైనట్టే అంటున్నారు శాస్త్రవేత్తలు.