మధుమేహం ఉన్నవారు ఒక పూట బ్లాక్ రైస్ తినండి, అద్భుతమైన ఫలితాలను చూస్తారు.
గత రెండు మూడేళ్ల నుంచే దేశ వ్యాప్తంగా రైతులు బ్లాక్ రైస్‌ను పండిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ పలు చోట్ల బ్లాక్ రైస్‌ను పండిస్తున్నారు. కాకపోతే.. చాలా తక్కువ ఎకరాల్లో ఈ పంటను ప్రస్తుతం పండిస్తున్నారు. అయితే.. కొన్ని కిరాణా, బియ్యం కొట్టుల్లో బ్లాక్ రైస్‌ను అమ్ముతున్నారు. కాకపోతే సాధారణ బియ్యం కన్నా.. బ్లాక్ రైస్ ధర మూడు నుంచి నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుంది. అయితే ఎప్పుడూ వాటినే తిని బోరుకొడితే ఓసారి బ్లాక్ రైస్ ప్రయత్నించి చూడండి.
దీన్ని రోజుకో పూట తినడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గి డయాబెటిస్ అదుపులోకి వస్తుంది. చపాతీలకు బదులు బ్లాక్ రైస్ తిన్నా మంచిదే. మధుమేహం అధికంగా ఉన్నవాళ్లు తెల్లన్నం పూర్తిగా వదిలేయాలి. ఒకపూట బ్లాక్ రైస్, మరో పూట రెండు చపాతీలతో తినాలి. కూరలు, పండ్లు, పెరుగు అధికంగా తినాలి. మధుమేహం అనేది రెండు రకాలు. అవి టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్‌లు. ఇందులో టైప్ 1 డయాబెటిస్ ఉన్నవారిలో శరీరం ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేదు. దీన్నే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటారు. టైప్ 2 డయాబెటిస్‌లో శరీరం ఇన్సులిన్‌కు స్పందించదు.
దీన్నే ఇన్సులిన్ నిరోధకత అంటారు. ఈ రెండు సందర్భాల్లో కూడా ఇన్సులిన్ స్థాయిలు తగ్గుతాయి. దీన్ని ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గడం అని కూడా అంటారు. దీని వల్ల రక్తంలో చక్కెర పెరిగిపోతుంది. ఇదే మధుమేహం. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుకోకపోతే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. మూత్ర పిండాలు దెబ్బతింటాయి. మధుమేహం ఉన్నవారు ఎప్పటికప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు నిరంతరం తనిఖీ చేసుకోవాలి. వీరు సరైన ఆహారం తీసుకుంటూ, వ్యాయామం చేయాలి. చక్కెర తక్కువగా ఉండే ఆహారాన్నే తినాలి. గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తినకూడదు.
ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తింటే చాలా మంచిది. డయాబెటిస్‌తో బాధపడేవారికి బ్లాక్ రైస్ ఆరోగ్యకరం.వాటిలో అధిక ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అంతేకాదు బ్లాక్ రైస్‌లో ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, ప్రోటీన్లు, ఐరన్ కూడా ఉన్నాయి. ఈ పోషకాలతో పాటు, బ్లాక్ రైస్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలు కూడా ఉన్నాయి, ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుండి రక్షిస్తాయి. నల్లబియ్యంలో అధిక మొత్తంలో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహకరిస్తుంది. మధుమేహంతో బాధపడేవారు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి ఇది సహాయపడుతుంది.