ఈ హోమ్ రెమిడీస్ తో కంటి చుట్టూ ఉన్న డార్క్ సర్కిల్స్ వెంటనే తగ్గిపోతాయి.
డార్క్ సర్కిల్స్ ఎంత అందంగా ఉన్నా ఈ మచ్చలు అందాన్ని దెబ్బతీస్తున్నాయని నేటి యువత ఆవేదన వ్యక్తం చేస్తోంది. పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా సహజంగానే ఇవి ఏర్పడుతున్నాయి. ఈ బ్లాక్ స్పాట్స్‌తో మీరు వయసులో పెద్దవారిగా కనిపిస్తారు. అయితేnపోషక పదార్ధాలు లోపించడం, ధూమపానం, ఎండలకు ఎక్స్‌పోజ్ అవడం వల్ల చర్మం దెబ్బతినడం లేదా జీన్స్ కూడా కంటి కింద డార్క్ సర్కిల్స్‌కు కారణాలంటున్నారు.
వాతావరణం మారినప్పుడు తలెత్తే ఎలర్జిక్ రియాక్షన్లు, జలుబు, ముక్కు మూసుకుపోవడం వల్ల కూడా కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి. మరోవైపు గంటల కొద్దీ సమయం కంప్యూటర్ల ముందు, మొబైల్ స్క్రీన్స్‌తో గడపడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది. డార్క్ సర్కిల్స్ అనేవి ముఖం అందాన్ని దెబ్బతీస్తాయి. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు కొన్ని సహజ సిద్ధమన వస్తువులతో తయారైన ఔషధాన్ని వినియోగిస్తే అద్బుత ఫలితాలుంటాయి.
మీ కంటి చుట్టూ నల్లగా మచ్చలేర్పడితే టీ బ్యాగ్ థెరపీ అద్భుతంగా పనిచేస్తుంది. దీనికోసం టీ తయారైన తరువాత టీ బ్యాగ్‌ను ఫ్రిజ్‌లో కూల్ చేయాలి. ఆ తరువాత ఆ టీ బ్యాగ్ కళ్లపై, కంటి చుట్టూ పెట్టుకోవాలి. 15-20 నిమిషాలసేపు ఇలా చేయడం వల్ల ఇందులో ఉండే కెఫీన్ నాళాలపై ప్రభావం చూపిస్తుంది. రక్త ప్రసరణ మెరుగుపర్చడం ద్వారా ఈ సమస్య తొలగిపోతుంది. అయితే క్రమం తప్పకుండా రోజుకు రెండుసార్లు చేయాల్సి వస్తుంది. మరో అద్భుతమైన మందు పాలు.
పాలు అనేది చర్మాన్ని డీప్ క్లీన్ చేసి కాంతివంతం చేస్తుంది. డార్క్ సర్కిల్స్ సమస్యకు పాలు అద్భుతంగా పనిచేస్తాయి. దీనికోసం కోల్డ్‌మిల్క్ వినియోగించాలి. చల్లని పాలతో చర్మంపై మసాజ్ చేయాలి. దీనివల్ల డార్క్ సర్కిల్స్ పోవడమే కాకుండా చర్మానికి నిగారింపు వస్తుంది. ఫ్రిజ్‌లో ఉంచిన పాలు 2-3 స్పూన్స్ తీసుకుని కంటి చుట్టూ రాసి మాలిష్ చేయాలి. ఓ అరగంట తరవాత తడిపిన దూదితో క్లీన్ చేసుకోవాలి. అదే సమయంలో ప్రతిరోజూ ఎక్కువ నీళ్లు తాగడం, రాత్రి 8 గంటల కచ్చితమైన నిద్ర కూడా అవసరం.