రోజు ఉదయాన్నే ఈ టీ తాగితే అద్భుత ప్రయోజనాలు. ఎలా తాయారు చెయ్యాలంటే..?
నిమ్మ చెట్టు ని నేరుగా తీసుకోవడం కంటే కూడా టీ గా తయారుచేసుకొని తాగితే రెట్టింపు ఫలితాలు కలుగుతాయి.. లెమన్ గ్రాస్ టీ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు.. ప్రతి ఒక్కరూ ఈ నీటిని కచ్చితంగా తాగుతారు. అయితే లెమన్ గ్రాస్ అనేది ఒక ఔషధ గుణాలున్న మూలిక.. దీనిని సైంబెపోగాన్ సిట్రాటస్ అనే శాస్త్రీయ నామంతో పిలుస్తారు. లెమన్ గ్రాస్ నిమ్మకాయ లాంటి సువాసను కలిగి ఉంటుంది. ఇది అనారోగ్య సమస్యలను దూరం చేసేందుకు ప్రధాన పాత్ర పోషిస్తుంది.
దీనిని క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, ఫోలేట్, ఫోలిక్ యాసిడ్, జింక్, మెగ్నీషియం, కాపర్, పొటాషియం, ఐరన్, ఫాస్పరస్, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలుంటాయి. కావున శరారంలోని రక్తంలో షుగర్ లెవెల్స్‌ను నియంత్రిస్తుంది. అయితే కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది.. ప్రస్తుతం చాలా మంది చెడు కొలెస్ట్రాల్, గుండె పోటు, మధుమేహం బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి పలు రకాల ఆహార నియమాలు పాటించడమేకాకుండా లెమన్ గ్రాస్‌ను వినియోగించాలని నిపుణులు తెలుపుతున్నారు.
ఇలా చేయడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి సులభంగా నియంత్రణలో ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చెడు కొలెస్ట్రాల్, గుండె జబ్బుల నుంచి తగ్గించి రక్షణకలిపిస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను తగ్గిస్తుంది.. డయాబెటిస్‌తో బాధపడేవారు తప్పకుండా లెమన్ గ్రాస్ వినియోగించాలని నిపుణులు తెలుపుతున్నారు. ఇది రక్తంలో చక్కెర పరిమాణాలను తగ్గించేందుకు సహాయపడుతుంది. కావున మధుమేహంతో బాధపడుతున్నవారు లెమన్‌గ్రాస్ టీ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే వీరు రోజుకు రెండు సార్లు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.
లెమన్‌గ్రాస్‌లో ‘సిట్రల్’, ‘లిమోనెన్’, ‘లినాలూల్’ అనే పదార్ధాలు ఉంటాయి. ఇవి ఇన్సులిన్ స్థాయిలపై ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా ఇది చాలా మందిలో రక్త పోటును కూడా నియంత్రిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. శరీరంలో లో గ్లూకోస్ టాలరెన్స్‌ను కూడా మెరుగుపరిచేందుకు దోహదపడుతుంది. లెమన్ గ్రాస్ ఎలా ఉపయోగించాలి..లెమన్ గ్రాస్‌తో టీ కూడా చేసుకుని తాగొచ్చు. అయితే దీనిని తయారు చేయడానికి.. లెమన్ గ్రాస్ టీని ఉదయాన్నే తాగడం వల్ల శరీరానికి మంచి ప్రయోజనాలు లభిస్తాయి.
అంతేకాకుండా జలుబు, జ్వరం వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. దీనిని సలాడ్‌లలో కలుపుకుని కూడా తినవచ్చు. ఇలా దీనిని రోజూ తీసుకుంటే మధుమేహం, గుండె సమస్యలు దూరమవుతాయి. ఎలా తయారు చేయాలి..? ఒక పాత్రలో 4 కప్పుల నీరు, 1 కప్పు లెమన్ గ్రాస్, 1 టేబుల్ స్పూన్ తేనె తీసుకోవాలి. ముందుగా నిమ్మగడ్డిని నీళ్లతో కడిగి చిన్నచిన్న ముక్కలుగా కోసి రాతిపై రుబ్బుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో నీటిని వేడి చేసి నిమ్మరసం వేసి ఈ నీటిని 10 నిమిషాలు మరిగించి అందులో రుబ్బుకున్న లెమన్ గ్రాస్ పేస్ట్‌ని వేయాలి. ఫిల్టర్ చేసి వేడిగా ఆస్వాదించాలి.