మాధురి దీక్షిత్ ఇప్పటికి ఫాలో అయ్యే బ్యూటీ సీక్రెట్ ఇదే.
బాలీవుడ్ సూపర్ డ్యాన్సర్‌గా పేరు తెచ్చుకున్న మాధురి దీక్షిత్ ఖల్‌నాయక్ మూవీలో చోళీకే ఫీచే క్యా హై అనే సాంగ్‌తో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఇప్పుడు పీచ్ అండ్ యెల్లో కలర్ లంగా జాకెట్‌తో దిగిన ఫోటోలను చూస్తున్న నెటిజన్లు వాటే ఫిగర్ అంటున్నారు. దాదాపు పదేళ్ల పాటు తన పాటులు, డ్యాన్స్, సినిమాలతో బాలీవుడ్ ఆడియన్స్‌నే కాదు..సౌత్‌లో కూడా మాధురి పేరు మారుమోగిపోయింది. ఇప్పుడు టీవీ షోలకు జడ్జీగా, కమర్షియల్ యాడ్స్‌లో కనిపిస్తోంది మాధురి దీక్షిత్.
అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ నటి మాధురి దీక్షిత్ తన అందానికి సంబంధించిన రహస్యాలను వెల్లడించింది.ఆమె అభిమానులకు ఆరోగ్యంగా ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలో చిట్కాలను పంచుకుంది. ఆమె నిత్యం వినియోగించే చర్మానికి సంబంధించిన ఫేస్ ప్యాక్ ల గురించి కూడా తెలిపింది మాధురి దీక్షిత్ తన అందాన్ని రక్షించుకునేందుకు పెంపొందించుకునేందుకు రోజు రెండు రకాల ఫేస్ ప్యాక్ లను ఉపయోగించేదని అభిమానులతో పంచుకుంది.
మె ఓట్స్‌తో తయారు చేసిన ఫేస్ ప్యాక్ వాడేది.. నటి మాధురి తన చర్మాన్ని సురిక్షితంగా, అందంగా కనిపించేందుకు నిత్యం ఓట్స్‌తో తయారు చేసిన ఫేస్ ప్యాక్ ను ఉపయోగించేది. ఈ ఫేస్ ప్యాక్ చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మం ఎప్పుడూ బిగుతుగా ఉంటుందని ముడతలు కూడా రావని అమె తెలిపింది. అయితే ఈ ఫేస్ ఫ్యాక్ తయారు చేసుకోవడానికి.. ముందుగా ఒక చెంచా ఓట్స్ పౌడర్ తీసుకోండి. అందులో కొంచెం తేనెను వేసి బాగా మిక్స్ చేయాలి. అంతేకాకుండా అందులో కొద్దిగా రోజ్ వాటర్ వేసి..ఇదే క్రమంలో పాలను కూడా వేసి ఫైన్‌గా మిక్స్ చేసుకోవాలి.
ఇలా తయారు చేసిన ఓట్స్ ఫేస్ ప్యాక్‌ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా మాధురి తన చర్మాన్ని అందంగా..కాంతి వంతంగా చేసుకోవడానికి క్రమం తప్పకుండా వినియోగించేదట..హనీ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలి..చాలామంది హీరోయిన్స్ అందంగా కనిపించేందుకు ముఖానికి మార్కెట్లో లభించే వివిధ రకాల ప్రొడక్షన్ వినియోగిస్తారు. అయితే మాధురి దీక్షిత్ హనీ ఫేస్ ప్యాక్ ను వినియోగించేదట.
ఈ ఫేస్ ప్యాక్ ను క్రమం తప్పకుండా ముఖానికి అప్లై చేస్తే ముఖం కాంతివంతంగా తయారవ్వడమే కాకుండా చర్మం ఎల్లప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంటుందని ఆమె తెలిపింది. అయితే ఈ ఫేస్ ప్యాక్ ను తయారు చేయడానికి ముందుగా.. ఒక చెంచా పాలను తీసుకొని.. అందులో అలోవెరా జెల్ వేసి ఒక చెంచాడు తేనెను వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ముఖానికి అప్లై చేసి శుభ్రంగా నీటితో ముఖాన్ని కడిగేయాలి. ఇలా చేస్తే అన్ని రకాల చర్మ సమస్యలు దూరమవుతాయని మాధురి దీక్షిత్ అన్నారు.