శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ముఖంపై ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకోండి.
శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు, కణాలు దృఢంగా ఉండేందుకు కొలెస్ట్రాల్ అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందులో చెడు కొలెస్ట్రాల్ ఒక మైనపులాంటి అంటుకునే పదార్థం. ఇది రక్తనాళాల్లో పేరుకుపోతుంది. దీని వల్ల శరీరానికి రక్తం, ఆక్సిజన్ అందకుండా అడ్డుపడి ఏ సమయంలోనైనా గుండెపోటు వచ్చే ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఆధునిక పోటీ ప్రపంచంలో కొలెస్ట్రాల్ సమస్య సర్వ సాధారణంగా మారింది. ప్రతి పదిమందిలో ముగ్గురికి ఈ సమస్య ఉందంటే అతిశయోక్తి కానేరదు.
డయాబెటిస్ రోగుల్లో కొలెస్ట్రాల్ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ అనేది ఓ సీరియస్ సమస్య. ఫలితంగా గుండె సంబంధిత వ్యాధుల ముప్పు పెరిగిపోతుంది. ఈ క్రమంలో కొలెస్ట్రాల్ లక్షణాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. కొలెస్ట్రాల్ పెరిగితే ముఖంపై కూడా లక్షణాలు కన్పిస్తాయంటున్నారు వైద్య నిపుణులు. ఆ వివరాలు మీ కోసం..కొలెస్ట్రాల్ పెరిగితే ముఖంపై కన్పించే లక్షణాలివే..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ముఖంపై వేడి దద్దుర్లు ఏర్పడతాయి. ఇదేదో సాధారణ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు.
కానీ ఇది చాలా ప్రమాదకరం. ముఖంపై వేడి దద్దుర్లకు కారణం కొలెస్ట్రాల్ కూడా ఉందని గుర్తుంచుకోవాలి. చర్మం రంగు మారడం.. అధిక కొలెస్ట్రాల్ లక్షణాల్లో ఒకటి చర్మం రంగు మారడం. అంటే ముఖం రంగు లైట్ బ్లాక్‌గా మారడం గమనించవచ్చు. కళ్ల చుట్టూ..చిన్న చిన్న గింజల్లా ఏర్పడతాయి. ఈ లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. సిరోసిస్ సమస్య.. సిరోసిస్ సమస్యకు చాలా కారణాలున్నా..ముఖ్య కారణం కొలెస్ట్రాల్ కూడా. కొలెస్ట్రాల్ ఎక్కువైతే సిరోసిస్ సమస్య తలెత్తవచ్చు.
ఎందుకంటే శరీరంలో డ్రైనెస్ రావడం వల్ల దురద, బ్లీడింగ్ సంభవిస్తాయి. ముఖంపై దురద.. ముఖంపై తరచూ ఎక్కువగా దురదగా ఉంటే కొలెస్ట్రాల్ ఎక్కువైనట్టు భావించవచ్చు. దీర్ఘకాలంగా ముఖంపై దురద, రెడ్‌నెస్ ఉంటే నిర్లక్ష్యం చేయవద్దు.. ముఖంపై ఎర్రని గింజలు..శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే..ముఖంపై, ముక్కుకు అటూ ఇటూ ఎర్రని చిన్న చిన్న గింజల్లా కన్పిస్తాయి. ఇవి కన్పిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.