ఎసిడిటీని నిర్లక్ష్యం చేస్తే ఈ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
జీర్ణాశయంలోని జఠర గ్రంథులు జఠర రసాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ జఠర రసంలో హైడ్రో క్లోరిక్ ఆమ్లం ఉంటుంది. ఇది జీర్ణాశయంలోని బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. ఒక్కోసారి ఇది అధికంగా తయారవుతుంది. అలా అధిక ఉత్పత్తి కావడాన్నే ‘ఎసిడిటీ’ అంటారు. అయితే ఎసిడిటీతో ఇబ్బంది మాములుగా ఉండదు.. ఏదీ మనస్పూర్తిగా తినలేం. మనం ముందు నుంచి మంచి జీవనశైలి పాటిస్తే ఎలాంటి సమస్యలు రావు..కానీ అది మన వల్ల కానీ పని.
ఎసిడిటీ అనేది కూడా దీర్ఘకాలికి సమస్యే.. అందరూ ఎసిడిటీ అంటే.. జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయడం లేదనే అనుకుంటారు కానీ దాంతోపాటు చాలా వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఎక్కువ ఎసిడిటీ సమస్య ఉంటే శరీరంలో కఫం, శ్లేష్మం ఎక్కువగా ఉండే సమస్య వస్తుంది. ఎసిడిటీ సమస్య ఉన్నవారిలో కేవలం 20 శాతం మందికి మాత్రమే గుండెల్లో మంట, మిగిలిన వారికి శ్వాసకోశ సమస్యలు వస్తాయి. శరీరంలో ఎసిడిటీ ఎక్కువగా ఉన్నవారికి దీర్ఘకాలిక దగ్గు, ఛాతీ నొప్పి, సైనస్ వంటి సమస్యలు మొదలవుతాయి.
ఎసిడిటీ అరిథ్మియా, గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఎసిడిటీ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సమస్య మొదలవుతుంది. ఎసిడిటీ వల్ల చర్మ సమస్యలు, అలర్జీలు, మధుమేహం, ఊబకాయం సమస్య కూడా పెరుగుతుంది. మూత్రాశయ ఇన్ఫెక్షన్, అపానవాయువు, అజీర్ణం, ఈస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. ఎసిడిటీ సమస్యతో బాధపడేవారికి కండరాల నొప్పి, కీళ్ల నొప్పులు, బోలు ఎముకల వ్యాధి సమస్యలు కూడా వస్తాయి.
ఎసిడిటీ లక్షణాలు .. ఈ సమస్య లక్షణాలు పైకి కనిపిస్తాయి.. కాబట్టి ఈజీగా తెలుసుకోవచ్చు.. ఆహారం తీసుకున్న కొన్ని గంటలకు వికారంగా అనిపించిడం, తల తిరుగుతున్నట్టు అనిపించడం. వామిట్ సెన్సేషన్, ఎక్కువగా చెమటలు పట్టడం, గుండెల్లో మంట అనిపించడం, మలబద్ధకం
నివారణ చిట్కాలు.. కొబ్బరి నీళ్లను కూడా తీసుకుంటూ ఉండండి. రోజూ ఒక గ్లాస్ పాలు తీసుకోవాలి. ఊరగాయలు, కారంగా ఉండే చట్నీలు, వెనిగర్ మొదలైనవి వాటిని వీలైనంత తక్కువ తీసుకోండి. పుదీనా ఆకులను రోజు ఉదయాన్నే పరిగడుపున నమలండి. అలాగే భోజనం తరువాత పుదీనా ఆకులతో చేసిన రసాన్ని కూడా తాగవచ్చు. అల్లం ఎసిడిటీని శక్తివంతంగా తగ్గిస్తుంది. ఉదయాన అల్లం ముక్కను నమలండి లేదా రోజు ఒక కప్పు అల్లంతో చేసిన టీని తాగండి. వీటితో పాటు మసాల ఎక్కువగా ఉన్నఆహారాలు, ఫాస్ట్ ఫుడ్స్‌కు దూరంగా ఉండండి.