Health

జీవితంలో ఒక్కసారైనా కొబ్బరి పాల టీ తాగాలి, ఎందుకంటే..?

కొబ్బరి పాలను గ్రీన్ లేదా బ్లాక్ టీతో కలిపి తయారు చేసిన కెఫిన్ కలిగిన పానీయమే కొబ్బరి టీ. కొబ్బరిని ఎక్కువగా పండించే ఉష్ణమండల ప్రాంతాలలో నివసించే ప్రజలు ఈ పానీయాన్ని తయారు చేస్తారు. కొబ్బరి పాలలో సంతృప్త కొవ్వు పుష్కలంగా ఉంటుంది. ఇందులో లారిక్ యాసిడ్, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ మొదలైనవి అధిక స్థాయిలో ఉంటాయి. అందువల్ల కొబ్బరి టీ తాగితే ఆరోగ్యానికి మంచిది. అయితే కొబ్బరి పాలను గ్రీన్ లేదా బ్లాక్ టీతో కలిపి తయారు చేసిన కెఫిన్ కలిగిన పానీయమే కొబ్బరి టీ.

కొబ్బరిని ఎక్కువగా పండించే ఉష్ణమండల ప్రాంతాలలో నివసించే ప్రజలు ఈ పానియాన్ని తయారు చేస్తారు. కొబ్బరి పాలలో మంచి కొవ్వు పుష్కలంగా ఉంటుంది. ఇందులో లారిక్ యాసిడ్, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ మొదలైనవి అధిక స్థాయిలో ఉంటాయి. అందువల్ల కొబ్బరి టీ తాగితే ఆరోగ్యానికి మంచిది. కొబ్బరి పాల టీకి గ్రీన్ టీ బ్యాగ్‌లను కలిపి కూడా తాగొచ్చు.. అందులో పాలీఫెనోలిక్ సమ్మేళనాలు , ఇతర క్రియాశీల పదార్థాలు ఉన్నాయి. కొబ్బరి పాలలో హైపర్లిపిడెమిక్‌ను సమతుల్యం చేసే మూలకాలు ఉంటాయి.

కొబ్బరిలో ఆరోగ్యకరమైన కొవ్వులు. యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల ఇది చర్మానికి మేలు చేస్తుంది. చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. కొబ్బరి టీ తాగితే యవ్వనం పెరుగుతుంది. దీర్ఘకాలం పాటు అందాన్ని కాపాడుకోవచ్చు. మీరు ఒకవేళ బరువు తగ్గాలని భావివిస్తుంటే.. కొబ్బరి పాల టీ తాగండి. కొబ్బరి నీళ్లలాగే ఈ టీ కూడా బరువు తగ్గడంలో దోహదపడుతుంది. బరువు పెరగడానికి కారణమయ్యే కొవ్వును నాశనం చేసే గుణాలు కొబ్బరిలో పుష్కలంగా ఉన్నాయి. అలాగే ఇందులో ఉండే క్యాలరీలు కూడా చాలా తక్కువ. నీటి శాతం ఎక్కువగా ఉంటుంది.

అందువల్ల బరువు తగ్గడానికి ఇది సాయపడుతుంది. ఒక పరిశోధన ప్రకారం.. కొబ్బరిలో ఉండే హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్, లారిక్ యాసిడ్‌లు అధిక రక్తపోటు, కరోనరీ హార్ట్ డిసీజ్ నుండి మిమ్మల్ని రక్షిస్తాయి. అందుకే కొబ్బరి పాలు టీ తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొబ్బరి పాల టీ రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది. కరోనా సమయంలో చాలా మంది నిపుణులు కరోనావైరస్ నుంచి రక్షణ పొందడానికి కొబ్బరి నీళ్ళు తాగాలని సూచించారు. కొబ్బరి పాలతో చేసిన టీ తాగడం ద్వారా కూడా మీరు రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker