Health

శరీరంలోని ఈ భాగాల్లో నొప్పి మీరు నిర్లక్ష్యం చేయొద్దు, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

వేళాపాలే లేని పని సమయం. బస్సులు, వాహనాల మీద ఆఫీసులకు వెళ్లే వారికి, రోజంతా బయట తిరిగి ఇంటికి చేరుకున్నాక ఒంటినొప్పులు మరో బాధను తెచ్చిపెడుతాయి. కనీసం హాయిగా పడుకుందామనుకున్నా.. ఇంటి బాధ్యతలు నిల్చోనివ్వవు, కూర్చోనివ్వవు. శారీరక శ్రమ అధికమవుతోంది. అయితే మధుమేహం, హైబీపీ, గుండెపోటు బాధితులుగా మారిపోతున్నారు. ముఖ్యంగా చాలామంది ఉద్యోగాల్లో పడిపోయి ఎప్పుడు పడితే అప్పుడు తింటున్నారు. అర్ధరాత్రిళ్ల వరకు మేల్కొంటున్నారు.

ఇవన్నీ అనారోగ్యకరమైన జీవనశైలికి సంకేతం. వీటివల్ల భవిష్యత్‌లో పలు అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. కాగా నేటి యువతలో గుండెపోటు బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఒక్కోసారి ఆకస్మికంగా కూడా గుండె జబ్బులు వస్తున్నాయి. ఈనేపథ్యంలో శరీరంలో కనిపించే కొన్ని సంకేతాలను ముందుగానే పసిగట్టడం ద్వారా గుండెపోటు నుంచి జాగ్రత్త పడవచ్చు. వెన్నునొప్పి..మీరు శరీరంలో వెన్నునొప్పితో బాధపడుతూ ఉంటే మరియు ఈ సమస్య నిరంతరం కొనసాగితే, అది కూడా గుండెపోటుకు సంకేతం కావచ్చు. వెన్నునొప్పి కారణంగా పనితీరు కూడా ప్రభావితమవుతుంది.

మీకు తరచుగా వెన్నునొప్పి ఉంటే, మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఛాతి నొప్పి..ఇది గుండెపోటుకు అతిపెద్ద సంకేతంగా పరిగణించవచ్చు. చాలామంది ఛాతీ నొప్పిని గ్యాస్ నొప్పిగా భావిస్తారు. నిర్లక్ష్యంతో ప్రాణాలమీదకు తెచ్చుకుంటారు. ఛాతీ నొప్పితో పాటు, విపరీతమైన భయం, చెమటలు పట్టడం కూడా గుండెపోటుకు ముందస్తు సంకేతాలు. జీర్ణ సమస్యలు..కాగా ఆహారంలో పొరపాట్లు కారణంగా, జీర్ణవ్యవస్థ బలహీనపడటం ప్రారంభమవుతుంది. అటువంటి పరిస్థితిలో అజీర్తి, గ్యాస్‌ సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యలు నిరంతరం కొనసాగితే గుండెపోటు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గ్యాస్ సమస్య నుంచి బయటపడేందుకు రోజూ వ్యాయామం చేయాలంటున్నారు. వీటికి దూరంగా ఉండాల్సిందే..సిగరెట్ లేదా ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే, ఈ రోజు నుంచే ఈ అలవాటును మానుకోవాలి. ఇది కాకుండా మార్కెట్‌లో దొరికే జంక్ ఫుడ్ వినియోగాన్ని కూడా తగ్గించాలి. ఈ రకమైన ఆహారం ధమనులలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. రక్త ప్రసరణలో సమస్యలను కలిగిస్తుంది. గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker