స్టార్ గుర్తు ఉన్న 500 నోటు నకిలీదా? కదా..? అసలు విషయం ఇదే.
మీ వద్ద 500 రూపాయల నోటు ఉండి దాని క్రమ సంఖ్య మధ్యలో స్టార్ గుర్తు ఉంటే అది నకిలీదని అర్థం చేసుకోండి అని ట్వీట్ చేశాడు. దీనితో పాటు, ఫోటోను షేర్ చేసిన వ్యక్తి ఈ రోజు అలాంటి 500 నోట్లను స్వీకరించడానికి ‘ఇండస్‌ఇండ్ బ్యాంక్’ నిరాకరించిందని రాశారు. అతను తన కస్టమర్‌కు స్టార్ గుర్తుతో కూడిన అనేక 500 నోట్లను తిరిగి ఇచ్చాడు. దీనితో పాటు, తన సందేశాన్ని వీలైనంత ఎక్కువ షేర్ చేయాలని, తద్వారా ప్రజలు నకిలీ నోట్ల గురించి తెలుసుకునేలా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాడు.
అయితే ప్రపంచంలో ఏ మూలన ఎక్కడ ఏమీ జరిగినా కానీ సోషల్ మీడియా వల్ల క్షణాల్లో ఆ వార్త తెలిసిపోతుంది. అయితే.. సోషల్ మీడియాలో వచ్చేవి అన్నీ నిజాలు అనుకుంటే పొరబడినట్లే. తప్పుడు వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం రూ.500 నోటు పై స్టార్(నక్షత్రం) గుర్తు ఉంటే ఆ నోటు నకిలీవి అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘స్టార్ గుర్తుతో ఉన్న 500 నోట్లు గత రెండు మూడు రోజుల నుంచి మార్కెట్‌లో చెలామణి అవ్వడం ప్రారంభించాయి. అలాంటి ఓ నోటు నిన్న ఇండస్ ఇండ్ బ్యాంక్ నుంచి వచ్చింది.
ఇది నకిలీ నోటు. ఈ రోజు కూడా ఒక స్నేహితుడు ఒక కస్టమర్ నుంచి అలాంటి నోట్లను రెండు లేదా మూడు అందుకున్నాడు. ఈ విషయం పై అతడికి అవగాహన లేదు. తనకు ఎవరో ఇచ్చారని చెప్పారు. దీనిపై మీరు జాగ్రత్తగా ఉండండి. మార్కెట్‌లో నకిలీ నోట్ల సంఖ్య పెరిగింది. కాబట్టి ఈ విషయాన్ని వీలైనంత ఎక్కువ మంది సోదరులకు ఈ సందేశాన్ని చేరవేయండి. తద్వారా వారు ఈ నకిలీ నోట్ల వల్ల మోసపోకుండా ఉంటారు. వీటిని ఎవరూ తీసుకోవద్దు.’ అనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఏదీ నిజం..ఈ విషయం రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా దృష్టికి వెళ్లింది. దీనిపై ఆర్‌బీఐ వివరణ ఇచ్చింది. అలాంటి వార్తలను నమ్మొద్దు అని సూచించింది. నక్షత్రం గుర్తు ఉన్న నోట్లు కూడా నిజమైనవేనని చెప్పింది. అవి కూడా చలామణిలో ఉన్నాయని తెలిపింది. మరీ నక్షత్రం గుర్తు ఎందుకు ఉన్నట్లు..?నక్షత్రం గుర్తు అనేది ఒక ఐడెంటిఫైయర్. అంటే.. భర్తీ చేయబడిన లేదా పునఃముద్రించబడిన నోటు అని దీని అర్థం. ఇలా ఎందుకంటే.. వాస్తవానికి ఇలాంటి నోట్లను తొలుత ముద్రించినప్పుడు ఏదో ఒక లోపం ఉంటుంది. ఆతరువాత దాన్ని సరిచేసి నక్షత్రం గుర్తుతో కొత్త నోటుతో ముద్రిస్తారు. నంబర్ ప్యానెల్‌లో ప్రిఫిక్స్, క్రమ సంఖ్య మధ్య నక్షత్రం గుర్తు జోడిస్తారు.