News

గుడ్ న్యూస్, 2 రూపాయల కాయిన్‌తో 5 లక్షలు సంపాదించవచ్చు. ఎలాగంటే..?

ఆర్‌బీఐ కరెన్సీ నోట్లను ముద్రించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటుంది. సీరియల్ నెంబర్లు సహా చాలా విషయాలు ఉంటాయి. ప్రింటింగ్‌లో ఏమైనా స్వల్ప తేడా ఉంటే.. అప్పుడు మార్కెట్‌లోకి వచ్చే నోట్లు కూడా చాలా స్పెషల్ అవుతాయి. వాటిని కొనేందుకు చాలా మంది రెడీ అవుతుంటారు. అయితే గత కొన్ని రోజులుగా పాత నాణేలు, పాత కరెన్సీ నోట్లకు డిమాండ్‌ పెరిగింది. ఎందుకంటే ఇవి అరుదైన కరెన్సీగా గుర్తింపును కలిగి ఉన్నాయి. ఇటువంటి వాటిని ఆసక్తి గల కొంతమంది పెద్ద మొత్తం వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు.

అలాంటిదే ఈ 2 రూపాయల కాయిన్. ఈ కాయిన్‌ మీ దగ్గర ఉంటే మీరు ధనవంతులు కావొచ్చు. ఈ నాణెం బదులుగా మీరు భారతీయ కరెన్సీలో 5 లక్షల రూపాయలను సంపాదించవచ్చు. నేటి కాలంలో పురాతన నాణేలకు చాలా డిమాండ్ ఉంది. నాణెం 1994, 1995, 1997 లేదా 2000 సిరీస్‌లో ఉండాలని గుర్తించుకోండి. వీటిని ఎలా విక్రయించాలి.. మీ దగ్గర పాత నాణెం ఉంటే దానికి ఇప్పుడు డిమాండ్‌లో ఉంది కాబట్టి మీరు వాటిని ఆన్‌లైన్‌లో విక్రయించవచ్చు.

1, 2, 5 లేదా 10 రూపాయల నాణేలు, నోట్లను అమ్మవచ్చు. కొన్ని వెబ్‌సైట్లలో పురాతన నాణేలను భారీ మొత్తానికి కొనుగోలు చేస్తారు. ఇటువంటి నాణేలు Indiamart.com, CoinBazar వంటి వెబ్‌సైట్లలో విక్రయిస్తారు. అలాగే మీరు OLX, Amazon, eBay వంటి వెబ్‌సైట్లలో కూడా నాణేలను ఉంచవచ్చు. మీకు సరైన ధర ఎక్కడ లభిస్తుందో అక్కడ విక్రయించవచ్చు. ఈ నాణేలను విక్రయించడానికి ముందుగా మీరు సంబంధిత వెబ్‌సైట్‌లో మీ ఖాతాను సృష్టించాలి.

తర్వాత నాణెం చిత్రం, వివరణను అప్‌లోడ్ చేయాలి. వేలంపాట దారులే వేలం వేస్తారు. ఈ రోజుల్లో 1 రూపాయి నాణెం, 2 రూపాయల నాణెం, వైష్ణో దేవి నాణెం చాలా డిమాండ్‌లో ఉన్నాయి. కావాలంటే బేరం కూడా చేసుకోవచ్చు. నాణేలను విక్రయించడానికి OLXలో విక్రేతగా నమోదు చేసుకోండి. నాణేనికి రెండు వైపులా ఉన్న ఫోటోను అప్‌లోడ్ చేయండి. మీ మొబైల్ నంబర్ ఈ-మెయిల్ ఐడిని తెలపండి. నాణెం కొనాలనుకునే వారు మిమ్మల్ని సంప్రదిస్తారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker